Breaking News

రవి ప్రకాశ్ కథ ముగిసింది

 


రెండు దశాబ్దాలకుపైగా మీడియా అగ్ర ధిగ్గజంగా వెలుగొందిన రవిప్రకాశ్ కు గడ్డు రోజులు దాపురించాయి. టివి 9 యాజమాన్యం చేతులు మారిన అనంతరం రవిప్రకాశ్  అటలకు బ్రేక్ పడింది. కేవలం 10 శాతం వాటాదారుల్లో ఒకరైన రవి ప్రకాశ్  కొత్త యాజమాన్యాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. ఆఖరికి ఆయనను టివి9 నుండి కొత్త యాజమాన్యం నాటకీయ పరిణామాల మద్య బయటికి పంపించి వేసింది.

8 శాతం వాటాతో 90.5 శాతం షేర్లు కలిగిన అలందా వాటాదారులను నియంత్రించాలని చూశాడు. చివరకు అవమానకర రీతిలో అటు సీఈవో పదవిని ఇటు డైరెక్టర్‌ పదవిని కోల్పోయాడు. టీవీ9 కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించింది.

టీవీ9 సీఈవో, డైరెక్టర్‌ పదవి నుంచి రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్లు ప్రకటించారు. టీవీ9 సంస్థలో చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో బోర్డుసభ్యులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రవి ప్రకాశ్‌ స్థానంలో కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా గొట్టిపాటి సింగారావు నియమిస్తున్నట్లు అలందా మీడియా డైరెక్టర్‌ ఎస్‌ సాంబశివరావు ప్రకటించారు. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే డైరెక్టర్ల సమావేశం నిర్వహించి మే 8న ఆయనను పదవి నుంచి తొలగించామని తెలిపారు.

No comments