Breaking News

అ్బబో సుద్ద పూస


 తాము రాసే రాతలను నమ్ముతలేరని ఇప్పటికి స్పృహలోకి వచ్చిన ఆంధ్రజ్యోతి ఆల్టర్ నేటివ్ మీడియాగా, బహుజనుల మీడియాగా నిలిచిన సోషల్ మీడియా మీద ఈ టైపులో విరుచుకుపడింది. అద్వానీని అవమానించాడని మోడీని సోషల్ మీడియా హైలైట్ చేయడంతో నొప్పి పడ్డ ఆంధ్రజ్యోతి అక్కసు చూడండి.. 

అలాగే-

Indus Martin post:

ప్రధాన స్రవంతి స్రావాలు (అస్సలు మిస్ కావొద్దు)
----------------------------
హహ్హహ్హా... చూడబోతే మెయిన్ మీడియా సోషల్ మిడియా పేరెత్తితే వుచ్చపోసుకుంటున్నట్టేవుంది. తన తార్పుడు నైజాన్ని ప్రజలు గుర్తించి తనమీద అపనమ్మకాన్ని తీవ్రంగా వ్యక్తపరుస్తున్న నేపధ్యంలో, ఈ ప్రధాన స్రవంతికి (లోల్.. ఎం స్రవిస్తుందో .. ప్రధానంగా) రెండే మార్గాలు
1. సోషల్ మీడియానే తన వునికికి ఆధారం చేసుకోవడం
2. సోషల్ మీడియా మీద దాడి చేసి దాని పాప్యులారిటీని నిలువరించడం
పై రెండు పనులనూ చెయ్యడం ప్రారంభించింది ఈ ప్రధాన స్రవంతి ప్రారంభించిందనే నా అభిప్రాయం.(స్రవంతి అంటే కేవలం మీడియా అని... అదేదో సైకో గురించిన ప్రస్తావన అస్సలు కాదు).
టీవీ9 తెలివి చూడండీ.... సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని (వాటిల్లో 90% మనం ఎప్పుడూ వినం) 'ఏది రియల్- ఏది వైరల్ ' అనే శీర్షికతో రోజూ కెలుక్కుని ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా అసత్య ప్రచారం అని చెబుతూ ఆ ప్రోగ్రామ్నే తన టీ ఆర్ పీ పెంచుకోడానికి ఎంత చౌకగా వాడుకుంటుందో!
అలాగే సోషల్ మీడియాలో మొదలైన యుద్ధాల్ని తన స్టూడియో చలువ గదుల వరకూ లాగి, చర్చ అనే సాకుతో రోజుల తరబడి రచ్చ చేస్తూ తన వ్యూవర్షిప్ ను పెంచుకుంటూ టీ ఆర్ పీ అనబడే వాంతిని గతుకుతూ పోయిన నెల చేసిన చీప్ వ్యాపారాన్ని మనం ఎలా మర్చిపోతాం? ఈ సందర్భంగా కత్తి మహేష్ లాంటి సోషల్ మిడియా సెలెబ్రిటీలను తన స్టూడియోకి పిలిపిచ్చుకుని ఆయన మీదే వ్యాపారం చేస్తూ ఆయన్నే అవహేళన చేసి పంపించిన ఘనత ఈ టీవీ చానెళ్లది.
రాంగోవ అనబడే ట్వీట్ వీరుడ్ని ఇదే చానెళ్ళు ఒక సినీ దర్శకుడికాకన్నా సోషల్ మీడియా హీరోగానే ఎక్కువ సార్లు తమ చర్చల్లోకి ఆహ్వానించాయి ఈ సో కాల్డ్ ప్రధాన మీడియా చానెళ్ళు. ఆయన తన వేళ్ళ కొనలతో ఏ ముక్కులో పెక్కు ఏ ట్వీట్ రూపంలో విసురుతాడా అని ఆశగా ఎదురు చూసే అశుద్ధ భక్షక పక్షుల్లా (స్కావెంజర్ బర్డ్స్) వుంటుంది వీటి పరిస్థితి.
ఈ చానెళ్లన్నిటికీ వాళ్లవాళ్ళ ఫేస్బుక్ పేజీలూ, యూ ట్యూబ్ చానెళ్ళూ వుండనే వుండగా, అక్కడ తమ తమ పేజీలమీదా, చానెళ్ళ మీదా ప్రకటనల ద్వారా, పర్ట్నర్ షిప్పుల ద్వారా ఆదాయం భారీగానే పొందుతూ వుండగా... మరో పక్క సోషల్ మీడియా అనేది ఒక బజారు వేశ్య అనే లెవెల్లో వర్జిన్ వార్తలూ, కార్యక్రమాలూ ప్రచారం/ ప్రసారం చేస్తున్నారు.
ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ నే తీసుకోండి. సోషల్ మీడియా అంటే ఒక అత్యంత దిగజారిన వేధికగానూ, అక్కడ జరిగేవన్నీ మాఫియా పనులేనన్నట్టు మెయిన్ పేజీలో ఇంత పెద్ద వ్యాసం రాసేసింది. ఇది రెండో రకం స్పంధన. అంటే సోషల్ మీడియాను ఒక బ్రంహ రాక్షసిగా చూపించి దాన్నుండి రక్షించే దివ్యస్వరూపిగా తనను ప్రమోట్ చేసుకోవడమే ఇలాంటి వ్యాసాల లక్ష్యం.
ఈ న్యూస్ పేపర్లూ, టీవీ చానెళ్ళూ ప్రవర్తించినంత పక్షపాతంతోనూ, కుల / మత/ ప్రాంత గజ్జితోనూ పోల్చితే సోషల్ మీడియా చాలా సేఫ్ అనే చెప్పాలి. ఇకడ ఎవడెవడికి ఏ గజ్జి వుందో పసిగట్టేసి వాడ్ని మన జోలికి రాకుండా కట్టడి చేసే విధానం వుంది. కానీ ఈ చానెళ్ళనూ, పేపర్లనూ మన ఇంట్లోకి రాకుండా చేసే మార్గం వుందా? వింటున్న/ చదువుతున్న వార్త ఎంత పక్షపాతంతో కూడుకున్నదైనా మనం దాన్ని ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో బ్రతుకుతాం. ఈ చానెళ్లనే అమ్మనా బూతులూ తిట్టుకుంటూ, ఈ పత్రికల చౌకబారుతనాన్నే నిందించుకుంటూ ముక్కుతూ మూలుగుతూ వాటినే చదువుతాం... చూస్తాం.
ప్రజల్ని మభ్యపెట్టే వ్యవస్తలైన రాజకీయం, మీడియా లకు సోషల్ మీడియా ఒక డైపర్ జ్ఞాపకం. రకరకాల ప్రలోభాలతో, అపోహలతో సమాజాన్ని సర్కస్ చేయించడానికి అలవాటుపడ్డ ఈ వీధి గారడీ వ్యవస్తలకు సోషల్ మిడియా అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ స్వప్నం. ఇదే సోషల్ మీడియాతో సరసాలాడి, వాడి గద్దెలెక్కిన నాయకులు కూడా తమ ముసుగులు తొలిగే సమయానికి సోషల్ మీడియా ఒక వ్యాధిగ్రస్త వ్యాంప్ అనే తీరుగా మాట్లాడతారు.
సోషల్ మీడియాలో వెధవలూ, వెధవరాండ్రూ లేరా? ఎందుకు లేరూ? బయట వున్నంతమంది కుక్కలు ఇక్కడా వున్నారు. అసలు అక్కడి కుక్కలే ఇక్కడ మొరిగితే భలే ఇకో సౌండ్ వస్తుందనే వుబలాటంతో సోషల్ మిడియాకు ఎక్కుతున్నారు. ఇన్నాళ్ళూ వీధి మూలల్లో గోడలమీద కాళ్ళెత్తిన ఇవే కుక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో గోడలమీదా అదే పని చేస్తున్నాయి. వీటిని నిలువరించడానికి కాస్త నైపుణ్యం, ఓపికా కావలి. లేదా వీటి పొడ సోకని విధంగా పరిచయాల్ని మెయింటెయిన్ చెయ్యాలి. ఇక్కడ జరిగే అసత్య ప్రచారాలకూ, బురద చిలకరింపులకూ, ద్వేష వమనాలకూ విరుగుడు పోలీస్ స్టేషల్నో వుంది. కాకపోతే ఎవడి బొక్కలు వాడు దాచుకుంటూ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్ళరు. తీసుకెళ్ళినా సోషల్ మీడీయాలో మీరు వుండటం కంపల్సరీ కాదండీ. అకౌంట్ మూసెయ్యండి... సమశ్యలు అవే తొలగిపోతాయి అని హితవు పలికే పోలీస్ వ్యవస్త మనది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని రెచ్చిపోతున్న సోషల్ మీడియా రౌడాలూ. రౌడీలూ (నా వుద్దేశంలో 'రౌడీ' స్త్రీ లింగం) రోజురోజుకూ పెరిగి పోతున్న మాట నిజమైనా, సోషల్ మీడియా ఒక డెసిషన్ మేకర్ గానూ, కింగ్ మేకర్ గానూ ఎదుగుతున్న మాట మాత్రం కీబోర్డ్ సత్యం (అక్షర సత్యం లాంటిదే). 

Indus Martin - 11.3.18
(Yousuf Baba Shaik's facebook post.)

No comments