గలీజ్...గజల్ శ్రీనివాస్ ...రేడియో జాకీని లైంగిక వేధింపులకు గురి చేసిన శ్రీనివాస్
హైదరాబాద్ : ఆంధ్ర సెలెబ్రెటీ గజల్ శ్రీనివాస్ గలీజు పని బయట పడింది. మహిళను లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలపై గజల్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గజల్ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా గజల్ శ్రీనివాస్‌ను ఏ1గా, పనిమనిషి పార్వతిని ఏ2గా చేర్చారు. మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, అభ్యంతరకరమైన ప్రాంతాల్లో మసాజ్ చేయాలని బెదరించేవాడని వేధింపులు ఎదుర్కొన్న యువతి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ వీడియోలను బాధితురాలు పోలీసులకు అందచేసింది.
గజల్ శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని పంజాగుట్ట ఏసీపీ తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు చెప్పారు. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడటం, గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.
No comments